వాలంటీర్ల వ్యవస్థకు రూ.310కోట్లు వృథా!

తాజా వార్తలు

Updated : 21/03/2021 17:30 IST

వాలంటీర్ల వ్యవస్థకు రూ.310కోట్లు వృథా!

తిరుపతి: నవరత్నాల అమలు కోసం వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ.. ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. తిరుపతి భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని విమర్శించారు. వాలంటీర్‌ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.310 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని ఆక్షేపించారు. 

పోలీస్‌, పంచాయతీ రాజ్‌, వాలంటీర్‌ వ్యవస్థల అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కృషిచేస్తున్నామని.. ప్రచారం, పర్యవేక్షణ కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. ప్రచార, నియోజకవర్గాల బాధ్యుల కమిటీకి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నేతృత్వం వహిస్తారని ఆయన ప్రకటించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని