
తాజా వార్తలు
ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరగనుంది. అసంపూర్తి భవనాల నిర్మాణానికి ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశముంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానంపై మంత్రి వర్గం చర్చించనున్నట్టు సమాచారం.
1.43 లక్షల మంది లబ్ధిదారులకు ఏపీ టిడ్కో కింద ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 300 చదరపు అడుగుల కేటాయింపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాకినాడ గేట్‌వే పోర్టులో భాగస్వామ్య వాటాల బదలాయింపు అంశం కూడా చర్చకు రానుంది. ఈబీసీ నేస్తం పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.
ఇవీ చదవండి
Tags :