AP News: 86శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 30/05/2021 14:30 IST

AP News: 86శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు: జగన్‌

అమరావతి: వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం పూర్తిచేశామని సీఎం జగన్‌ అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండో ఏటా..ఇచ్చిన మాటకే పెద్ద పీట!’ పుస్తకాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ రెండేళ్లలో ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ.95,528 కోట్లు.. పరోక్షంగా రూ.36,197కోట్లు జమ చేశామన్నారు. 

రాష్ట్రంలోని 86 శాతం ఇళ్లకు ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందాయని సీఎం జగన్‌ వివరించారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగామన్నారు. ఇంకా మంచి చేయడానికి మీ ముఖ్యమంత్రిగా, కుటుంబసభ్యుడిగా మరింత తాపత్రయ పడతానని చెప్పారు. ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృధ్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి
తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జగన్‌ ధన్యవాదాలు చెప్పారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని