మున్సిపల్ పదవుల్లో మహిళలకు పెద్దపీట:జగన్‌
close

తాజా వార్తలు

Updated : 01/04/2021 16:53 IST

మున్సిపల్ పదవుల్లో మహిళలకు పెద్దపీట:జగన్‌

అమరావతి: కార్పొరేషన్‌, మున్సిపల్‌ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసినట్లు ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61శాతం పదవులు కేటాయించినట్లు తెలిపారు. విజయవాడలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్‌ తరగతుల కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. దీనికోసం ప్రతి వార్డుకు 2 చొప్పున 8వేల వాహనాలు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 

మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు..

అర్హులకు ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందాలని.. వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సేవలందించాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా 540 రకాల సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. మరింత మెరుగైన సేవలకు సూచనలివ్వాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేశామన్నారు. పేదల కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించే యోచన చేస్తున్నామని.. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని జగన్‌ ప్రకటించారు. పట్టణ, నగర ప్రాంతాల పాలక మండళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని.. సీఎం కార్యాలయంతో సంప్రదించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవరత్నాలతో లబ్ధిదారులకు రూ.లక్షకోట్లు అందించామన్నారు. రైతులకు విత్తనం నుంచి మార్కెటింగ్‌ వరకు సౌకర్యం కల్పించామని సీఎం వివరించారు.

 

 

 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని