పంచాయతీ ఎన్నికలపై హౌస్‌మోషన్‌ పిటిషన్‌

తాజా వార్తలు

Updated : 09/01/2021 16:45 IST

పంచాయతీ ఎన్నికలపై హౌస్‌మోషన్‌ పిటిషన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రోజురోజుకీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. తాజాగా పంచాయతీ ఎన్నికల ప్రకటనపై రాష్ట్ర సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గతంలోనే ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కరోనా పరిస్థితులు, టీకా షెడ్యూల్‌ వల్ల ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రొసీడింగ్స్‌ని నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరువర్గాలు కూర్చుని ఎన్నికల నిర్వహణపై మాట్లాడుకోవాలని.. ముగ్గురు సీనియర్‌ అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలోని బృందం ఎస్‌ఈసీని శుక్రవారం కలిసింది.

ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సిన అవసరాన్ని సీఎస్‌కు ఎస్‌ఈసీ వివరించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సూచించారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులను ఎస్‌ఈసీకి సీఎస్‌ వివరించారు. ఫిబ్రవరిలో ఎన్నికలకు సన్నద్ధం కాలేమని.. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్‌ఈసీకి సీఎస్‌ వివరించారు. ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేయాలని అధికారులు బృందం ఎస్‌ఈసీని కోరింది. ఎస్‌ఈసీతో ప్రతినిధుల బృందం భేటీ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్యంగా నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ ప్రకటనను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది.

ఇవీ చదవండి..

ఎన్నికల నియమావళిపై సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ

ఎన్నికల సిబ్బందికి టీకా ఇవ్వండి: ఎస్‌ఈసీTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని