
తాజా వార్తలు
ఎస్ఈసీ అడ్డగోలు చర్యలను ప్రభుత్వం తిప్పికొడుతుంది
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇద్దరు సీనియర్ అధికారులను ఉద్దేశించి ఎస్ఈసీ రాసిన లేఖలో వాడిన భాష ఆయన స్థాయికి తగినట్లుగా లేదన్నారు. ఉద్యోగులు సక్రమంగా విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చేసి తద్వారా తెదేపాకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తు్న్నారని సజ్జల ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లో రిమార్కులు చేర్చాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ఎస్ఈసీ లేఖ రాయడం సరికాదన్నారు. 2021 ఓటర్ల జాబితా తీసుకుంటే తన హయాంలో ఎన్నికలు జరగవనే.. 2019 జాబితాను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులపై తప్పు నెట్టి లేఖ రాశారని ఆక్షేపించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తు రహితంగా జరుగుతాయని.. వీటిలో బలాబలాలు తేలేదేమీ ఉండదన్నారు. మార్చిలోపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా స్వీప్ చేస్తుందని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ అడ్డగోలు చర్యలను ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు. తన పరిధి దాటి ఉద్యోగులపై లేఖ రాయడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.
ఇవీ చదవండి..
ఏకగ్రీవాల ప్రకటనపై వివరణ కోరా: నిమ్మగడ్డ
వెంకట్రామిరెడ్డి తీరు ఆక్షేపణీయం: బొప్పరాజు