తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 07/08/2020 02:56 IST

తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు: ఆళ్ల నాని

తిరుపతి: రాష్ట్రంలో అధికమవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా ఆసుపత్రుల్లో పడకలను పెంచుతున్నామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. అవసరమైతే మరిన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిని మంత్రి గురువారం సందర్శించి పరిశీలించారు. పీపీఈ కిట్‌ ధరించి కొవిడ్‌ వార్డుల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై స్వయంగా ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

కరోనా బారిన పడిన ప్రతి వ్యక్తి కోలుకోవడానికి అవసరమైన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కొవిడ్‌ రోగులకు వైద్యం అందించడానికి నెలకు రూ.350కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వార్డు పరిశీలనకు వెళ్లిన సమయంలో కొందరు రోగులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరించడానికి తగిన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందించడంలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు తగిన రీతిలో వ్యవహరించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యం తమ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని