పోలవరానికి నిధులివ్వండి: బుగ్గన

తాజా వార్తలు

Published : 24/09/2020 14:26 IST

పోలవరానికి నిధులివ్వండి: బుగ్గన

దిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, కేంద్ర సహకారం కోరామన్నారు.
 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్రానికి నిధులు విడుదల వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలు, రామాయపట్నం పోర్టు, పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేక హోదా అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జీఎస్టీ బకాయిల అంశంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆప్షన్లపై చర్చించాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 760 కోట్ల రూపాయల బిల్లులు పునః పరిశీలన చేయాలని కోరామని చెప్పారు. బుగ్గనతో పాటు ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని