Peddi Reddy: ‘ఇంటింటికీ తిరిగి ఓట్లడిగితే విలువ తెలిసేది’
close

తాజా వార్తలు

Published : 22/05/2021 01:27 IST

Peddi Reddy: ‘ఇంటింటికీ తిరిగి ఓట్లడిగితే విలువ తెలిసేది’

పుంగనూరు నేతలపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు వైకాపా నేతలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ హరినారాయణతో కలిసి కొవిడ్‌ ఆస్పత్రిని పరిశీలించిన ఆయన.. సొంత నియోజకవర్గంలో రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సదుపాయాలపై పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగి గెలిస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రజల విలువ తెలిసేదన్నారు. ఎవరికీ సేవ చేయాలనే ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరుపై గెలిచిన నేతలంతా ఇళ్లలో కూర్చొని ప్రజల్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇకనైనా శ్రద్ధ తీసుకొని అధికారులకు సహకరించాలని సూచించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని