తెదేపాకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు 

తాజా వార్తలు

Published : 05/02/2021 01:58 IST

తెదేపాకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు 

అమరావతి: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. మేనిఫెస్టో ఉపసంహరించుకోవాలని తెదేపాకు సూచించింది. ఏపీలో నాలుగు విడతలుగా జరగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇటీవల మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే దీనిపై అధికార వైకాపా అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెదేపా మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ తెలుగుదేశం పార్టీని వివరణ కోరింది. తెదేపా వివరణ సంతృప్తికరంగా లేదని భావించిన ఎస్‌ఈసీ మేనిఫెస్టో పత్రాలను ప్రచారంలో వినియోగించవద్దని సూచించింది. 

ఇదీ చదవండి
ఆర్టీసీ ఉద్యోగ భద్రత దస్త్రానికి కేసీఆర్‌ ఆమోదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని