‘రేషన్‌’ వాహనాల రంగులు మార్చండి: ఎస్‌ఈసీ

తాజా వార్తలు

Updated : 06/02/2021 13:19 IST

‘రేషన్‌’ వాహనాల రంగులు మార్చండి: ఎస్‌ఈసీ

అధికారులకు ఆదేశం

అమరావతి: ఏపీలో బియ్యం పంపిణీ వాహనాల రంగులు మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. వాహనాలపై వైకాపా రంగులు ఉన్నాయని ఎస్‌ఈసీ అభిప్రాయపడింది. పార్టీలకు సంబంధం లేని రంగులు వేసి తేవాలని అధికారులకు సూచించింది. అంతవరకు గ్రామాల్లో వాహనాలతో రేషన్‌ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది. రంగులు మార్చాకే వాహనాల ద్వారా పంపిణీకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. రెండ్రోజుల క్రితం వాహనాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి..

ప్రభుత్వంలో చర్చించాక మాట్లాడతాం: బొత్స జగన్‌ ముందుంటే.. మేమంతా ఆయన వెంటే: అయ్యన్న

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని