Ap news: మద్యపాన నిషేధం హామీ ఏమైంది?: అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Published : 02/08/2021 15:35 IST

Ap news: మద్యపాన నిషేధం హామీ ఏమైంది?: అచ్చెన్నాయుడు

అమరావతి: సీఎం జగన్‌ చెప్పిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మద్యం దుకాణాలు పెంచడమే మద్యపాన నిషేదమా? అని ఆయన నిలదీశారు. మద్యం మత్తులో మునిగి తేలుతున్న వైకాపా ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించడం ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని ఆక్షేపించారు. పర్యాటక ప్రాంతాల్లో 300 దుకాణాల ఏర్పాటుకు ప్రణాళికలు వేసి, అందులో 41 షాపులను అందుబాటులోకి తెచ్చారని విమర్శించారు. వాకిన్‌ స్టోర్‌ పేరుతో 90 మద్యం మాల్స్‌కు అనుమతులిచ్చి ఇప్పటికే 21 ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25 వేల కోట్ల అప్పు కోసం భవిష్యత్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని