వారికోసం జగన్‌ కొత్త పథకం: అచ్చెన్న ఎద్దేవా
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 14:45 IST

వారికోసం జగన్‌ కొత్త పథకం: అచ్చెన్న ఎద్దేవా

అమరావతి: ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా అవినీతిపరుల కోసం పనిచేస్తున్నారని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 'సర్కారు వారి దొంగలు' పేరిట ఆయన కొత్త పథకం తీసుకొచ్చి రాష్ట్రాన్ని తన అవినీతి కేసుల్లో ఉన్న సహనిందితులకు దోచి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘నీకిది నాకిది (క్విడ్‌ ప్రోకో)’ ప్రాతిపదికన వేల కోట్లు దోచకున్న జగన్.. ఇప్పుడు అధికారంలోకి రాగానే క్విడ్ ప్రో కో-2 కు తెరలేపారని ఆరోపించారు. గతంలో క్విడ్ ప్రో కోకు సహకరించి జెలుకెళ్లిన అధికారులకు పట్టిన గతే క్విడ్ ప్రోకో2లోనూ పట్టనుందని అచ్చెన్న హెచ్చరించారు. జగన్‌ సీఎం కాగానే సరస్వతి సిమెంట్స్ లీజు గడువు పెంచుకున్నారని.. తాజాగా ఇండియా సిమెంట్స్ లీజు గడువును ఏకంగా 50ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారని చెప్పారు. గత రెండేళ్లలో ఏ వర్గానికీ సరైన లబ్ధి చేకూరకపోగా జగన్ కేసుల్లో ఉన్న సహ నిందితుల కంపెనీలు మాత్రం బాగుపడ్డాయన్నారు. అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు కట్టబెడుతూ కంపెనీలకు కాంట్రాక్టులు దోచిపెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

రెండు పార్లమెంట్‌ స్థానాలకు తెదేపా కమిటీలు

గుంటూరు జిల్లా నరసరావుపేట, రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానాల తెదేపా కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మాజీ మంత్రి జవహర్ అధ్యక్షతన 36 మందితో రాజమహేంద్రవరం.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధ్యక్షతన 36 మందితో నరసరావుపేట పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. మొత్తం 72 పదవుల్లో 32 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని