10వేల ఉద్యోగ ఖాళీలే కనిపించాయా?: అచ్చెన్న

తాజా వార్తలు

Updated : 06/07/2021 14:45 IST

10వేల ఉద్యోగ ఖాళీలే కనిపించాయా?: అచ్చెన్న

అమరావతి: విన్నాను.. ఉన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కు రాష్ట్రంలో 10 వేల ఉద్యోగ ఖాళీలే కనిపించాయా?అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. సీఎం చేసిన మోసం వల్లే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పత్రికా ప్రకటనలో మండిపడ్డారు. కర్నూలు జిల్లా చనుగొండ్ల గ్రామంలో నిరుద్యోగి గోపాల్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటీకీ ప్రభుత్వ హత్యే అని.. అతడి కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

ఇంటికో ఉద్యోగం ఇస్తాననే మాట తప్పి రెండేళ్లలోనే కోటి మందికి ఉపాధి పోగొట్టిన ఘనత జగన్‌దే అని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికి ప్రధాని మోదీకి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై యువతను దారుణంగా జగన్‌ దగా చేశారని అచ్చెన్న మండిపడ్డారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని