ఏపీలో ప్రైవేట్‌ టీచర్లను ఆదుకోవాలి: అచ్చెన్న
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 12:05 IST

ఏపీలో ప్రైవేట్‌ టీచర్లను ఆదుకోవాలి: అచ్చెన్న

అమరావతి: ప్రైవేట్‌ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని ఏపీ తెదేపా అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఇప్పటి వరకు 25 మంది ప్రైవేటు టీచర్లు మృతిచెందినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అచ్చెన్న ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేట్‌ టీచర్లు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని.. ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని