Rahul Gandhi: 70 ఏళ్లలో సృష్టించిన ఆస్తులను అమ్మేస్తున్నారు!

తాజా వార్తలు

Published : 25/08/2021 01:24 IST

Rahul Gandhi: 70 ఏళ్లలో సృష్టించిన ఆస్తులను అమ్మేస్తున్నారు!

దిల్లీ: గత 70 ఏళ్లలో దేశంలో ఏమీ జరగలేదంటూనే ఆ సమయంలో సృష్టించిన ఆస్తులను భాజపా ప్రభుత్వం అమ్మేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన జాతీయ మానటైజేషన్‌ పైప్‌లైన్‌తో మోదీ సర్కార్‌ తనకు మిత్రులైన కొద్దిమంది వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చాలనుకుంటోందని ఆరోపించారు. కీలక రంగాల్లో గుత్తాధిపత్యం, ఉద్యోగాలను నాశనం చేయడమే లక్ష్యంగా మోదీ సర్కార్‌ ప్రయివేటీకరణ ప్రణాళిక ఉందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు సృష్టించిన సంపదనంతా విక్రయించే ప్రక్రియలో ప్రభుత్వం ఉందన్నారు. ఆస్తుల నగదీకరణ (మానిటైజేషన్‌) ద్వారా నాలుగేళ్లలో రూ.6లక్షల కోట్లు సమకూర్చడమే లక్ష్యంగా నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను తీసుకొచ్చినట్టు నిన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ చేసిన ప్రకటనపై రాహుల్‌ స్పందించారు. మంగళవారం దిల్లీలో ఆయన కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరంతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం కాదు.. కానీ..!

ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదనీ, హేతుబద్ధతలేని ప్రైవేటీకరణకు మాత్రం తాము వ్యతిరేకమని రాహుల్‌ స్పష్టంచేశారు. వ్యూహాత్మక రంగాలను తాము ప్రయివేటీకరించలేదని తెలిపారు.  రైల్వే రంగాన్ని గతంలో తాము వ్యూహాత్మక రంగంగా భావించామని చెప్పారు. నష్టాలు తెచ్చే పరిశ్రమలనే తాము ప్రయివేటీకరించాం తప్ప.. గుత్తాధిపత్యానికి దారితీసేలా చేయలేదన్నారు.  మోదీ సర్కార్‌ ప్రతి ఒక్కటీ అమ్మేయాలని చూస్తోందని.. ఆర్థిక వ్యవస్థ నిర్వహించే తీరు భాజపాకు తెలియదని మండిపడ్డారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని