అంబులెన్స్‌లు ఆపినా పట్టించుకోరా?: అచ్చెన్న

తాజా వార్తలు

Updated : 14/05/2021 12:28 IST

అంబులెన్స్‌లు ఆపినా పట్టించుకోరా?: అచ్చెన్న

విశాఖ: వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకూ కులం ఆపాదిస్తారా? అని వైకాపా నేతలను ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ల కోసం లేఖలు రాస్తే సరిపోతుందా.. డబ్బు చెల్లించరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో సామాన్యులకు వ్యాక్సిన్ అందే పరిస్థితి లేదని.. వాటి కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారని చెప్పారు. ‘‘ఆక్సిజన్‌ కొరతతో ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టదా?సరిహద్దు వద్ద అంబులెన్స్‌లను ఆపుతున్నా పట్టించుకోరా?తెలంగాణకు అంబులెన్స్‌లను పంపలేని స్థితిలో పాలకులున్నారు’’ అని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు.

అంబులెన్స్‌లు ఆపడం దారుణం: రామకృష్ణ

సరిహద్దులో అంబులెన్స్‌లను ఆపడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మెరుగైన చికిత్స కోసం వెళ్తున్న వారిని అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని