లోకేశ్‌ అలుపెరుగని పోరాటం చేశారు: అచ్చెన్న
close

తాజా వార్తలు

Published : 25/06/2021 12:21 IST

లోకేశ్‌ అలుపెరుగని పోరాటం చేశారు: అచ్చెన్న

అమరావతి: రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు మొండిగా ముందుకెళ్లిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ స్పష్టత రాలేదని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యువత తలుచుకుంటే ఏమైనా సాధిస్తారని మరోసారి నిరూపితమైందన్నారు. పరీక్షల రద్దు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండు నెలల పాటు అలుపెరుగని పోరాటం చేశారని.. సీఎం జగన్‌ మాత్రం మూర్ఖంగా వ్యవహరించారని మండిపడ్డారు. 

విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేశ్‌ సఫలమయ్యారన్నారు. సీఎం జగన్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించే సమయం దొరకలేదా? అని నిలదీశారు. ప్రధాని మోదీ సైతం పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకుంటే ఆ మాత్రం సమయం కూడా లేదన్నట్లు జగన్‌ వ్యవహరించారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని