Ap news: దుర్మార్గాలకు చిరునామాగా మార్చేశారు

తాజా వార్తలు

Published : 26/06/2021 12:21 IST

Ap news: దుర్మార్గాలకు చిరునామాగా మార్చేశారు

వైకాపా ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు మండిపాటు

అమరావతి: చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఆర్‌.నడింపల్లిలో తెదేపా నేత మునెప్పపై వైకాపా నేతలు కత్తులతో దాడి చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మునెప్ప భూమిని కబ్జా చేయటంతోపాటు అడ్డుకున్నందుకు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. మునెప్పకు పార్టీ అండగా ఉండటంతోపాటు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అచ్చెన్న ప్రకటన విడుదల చేశారు. 

అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ను అరాచకాలు, ఆకృత్యాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు చిరునామాగా మార్చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పేదల ఆస్తులు ఆక్రమించి దాడులతో మారణహోమం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా? అని నిలదీశారు. దాడులు జరగని రోజు, విధ్వంసం చోటుచేసుకోని ప్రాంతం లేదన్నట్లుగా రాష్ట్రం తయారైందన్నారు. అధికారం అండతో రాష్ట్రంలో రాజారెడ్డి కత్తుల రాజ్యాంగం అమలు చేస్తూ అడ్డుకున్న వారిని హతమార్చేందుకు తెగబడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం, వైకాపా నేతల ఇష్టారాజ్యంతో ప్రజలు స్వేచ్ఛగా బతకలేకపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా జగన్‌ నిత్యం మండిస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని