‘రఘురామకు ఏం జరిగినా సీఎందే బాధ్యత’
close

తాజా వార్తలు

Published : 17/05/2021 01:29 IST

‘రఘురామకు ఏం జరిగినా సీఎందే బాధ్యత’

అమరావతి: కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును జైలుకు తరలించారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రఘురామకు ఏం జరిగినా సీఎం, సీఐడీ అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. సీఎం జగన్‌ కనుసన్నల్లోనే మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన చెందుతున్నారని, కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని