అనర్హత వేటుపై స్పందించిన బలరామ్‌నాయక్‌
close

తాజా వార్తలు

Published : 24/06/2021 00:53 IST

అనర్హత వేటుపై స్పందించిన బలరామ్‌నాయక్‌

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌ నాయక్‌ మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. సీఈసీ నిర్ణయంపై బలరాం నాయక్‌ స్పందించారు. ‘‘గత ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేశా. అప్పట్లో అన్ని రకాల పత్రాలను ఎన్నికల కమిషన్‌కు నివేదించా. కానీ, సరైన పత్రాలు నివేదించలేదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ నాపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేసింది. నా వద్ద అన్ని రకాల పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు నేరుగా కానీ, న్యాయస్థానం ద్వారా కాని తిరిగి పత్రాలను నివేదిస్తాను. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని బలరామ్‌నాయక్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని