ప్రజలను రెచ్చగొట్టేందుకే ప్రయత్నం: సంజయ్‌

తాజా వార్తలు

Updated : 06/07/2021 16:07 IST

ప్రజలను రెచ్చగొట్టేందుకే ప్రయత్నం: సంజయ్‌

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఎత్తిపోతల ఆపాలని తొలిసారి స్పందించింది తానేనని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ.. 2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిందన్నారు. ఆ రోజు కావాలనే సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారని చెప్పారు. కేసీఆర్‌, జగన్‌ మధ్య ఉన్న అవగాహన బయట పడుతుందనే కౌన్సిల్‌ భేటీకి వెళ్లట్లేదని ఆరోపించారు.

ప్రాజెక్టుల వద్ద పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది?అని సంజయ్‌ ప్రశ్నించారు. సీమ ఎత్తిపోతల పనులు పూర్తవుతుంటే కేసీఆర్‌ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారని సంజయ్‌ విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే ఇద్దరు సీఎంలు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెర లేపారని ఆరోపించారు. కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేయడం ఒక జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ వల్లే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోందని విమర్శించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీటి కేటాయింపులకు ఒప్పుకొని.. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని