తెరాస ప్రభుత్వం..లీకేజీల ప్రభుత్వం: సంజయ్‌
close

తాజా వార్తలు

Published : 01/07/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరాస ప్రభుత్వం..లీకేజీల ప్రభుత్వం: సంజయ్‌

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మంగళవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. మొన్న కాళేశ్వరం, అంతకుముందు మిడ్‌ మానేరు, మల్లన్నసాగర్‌, నేడు కొండపోచమ్మ కాలువకు గండి.. ఇలా నాణ్యతలేని ప్రాజెక్టుల వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారన్నారు.

 సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారనడానికి కొండ పోచమ్మ కాలువకు పడిన గండే సాక్ష్యమని విమర్శించారు. ఈలీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈలీకేజీలకు మూలకారణమని ధ్వజమెత్తారు. నాణ్యతలేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేసి కఠిన చర్యలు చేపట్టాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని