close

తాజా వార్తలు

Updated : 27/01/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫిట్‌మెంట్‌ పేరుతో కొత్త డ్రామా: బండి సంజయ్‌

హైదరాబాద్: ఫిట్‌మెంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరలేపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఉద్యోగులను మూడేళ్లుగా ఊరించి ఇప్పుడు ఉసూరుమనిపించారని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్‌ ప్రకటన విడుదల చేశారు. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వానికి మూడేళ్ల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఫిట్‌మెంట్‌ 7.5 శాతం ఇచ్చి హెచ్‌ఆర్‌ఏ 6 శాతం తగ్గించాలని ప్రతిపాదించడం దారుణమన్నారు. రోజురోజుకీ ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏని తగ్గించాలనుకుంటారా? అని నిలదీశారు. ఉద్యోగులు కోరినట్లు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ వేసినప్పుడు ఐఆర్‌ ఇవ్వడం సంప్రదాయమని.. కానీ అదీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను, సన్న బియ్యం పేరుతో రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీఆర్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయనిచ్చిందా? లేదా బలవంతంగా పీఆర్‌సీ రాయించారా? అని ప్రశ్నించారు. కమిటీపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నివేదికను రాయించిందని ఆరోపించారు. మూడేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చేది ఇదేనా? అని నిలదీశారు. ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్‌మెంట్‌ను ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇవ్వలేదని సంజయ్‌ ఆరోపించారు.

ఇవీ చదవండి..

ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్‌ : అనుష్క

కనీస వేతరం రూ.19వేలు ఉండాలి..




Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని