
తాజా వార్తలు
భాజపాలో చేరిన బెంగాలీ నటి పాయల్ సర్కార్
కోల్కతా: పశ్చిమ్ బంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపాలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు నేతలు భాజపా తీర్థం పుచ్చుకోగా .. తాజాగా ప్రముఖ బెంగాలీ నటి పాయల్ సర్కార్ ఆ పార్టీలో చేరారు. గురువారం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పశ్చిమ్ బంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలిప్ ఘోష్ సమక్షంలో పాయల్ సర్కార్ భాజపాలో చేరారు. నిన్న మాజీ క్రికెటర్ అశోక్ దిండా, గత వారం ప్రముఖ బెంగాలీ నటుడు యశ్దాస్ గుప్తా భాజపాలో చేరిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
Tags :