close

తాజా వార్తలు

Published : 09/04/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజకీయాలను పూర్తిగా భ్రష్టుపట్టించారు: భట్టి

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులు, కౌలు రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా సీఎం కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస శాసనసభాపక్షంలో తెదేపా పక్షం విలీనం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. సీఎం కేసీఆర్‌ రాజకీయాలను పూర్తిగా భ్రష్టుపట్టించారని.. ప్రతిపక్షమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల పర్వంలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతున్నారని విమర్శించారు. నాడు తెలంగాణా ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించారని.. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా మరోసారి నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని భట్టి మండిపడ్డారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని