అప్పుల ఊబిలో తెలంగాణ: భట్టి

తాజా వార్తలు

Published : 17/07/2020 13:19 IST

అప్పుల ఊబిలో తెలంగాణ: భట్టి

హైదరాబాద్‌: కరోనాతో ప్రజలు భయపడుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం అప్పులపై దృష్టి పెట్టారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల సుడిగుండంలో ముంచారని విమర్శించారు. 2023 కల్లా రూ.6లక్షల కోట్లు అప్పు చేసేందుకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.

‘‘తెలంగాణలో ప్రతి వ్యక్తి తలపై రూ.1.50లక్షల అప్పు ఉంటుంది. తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు?. తెలంగాణంలో ఒక్కో వ్యక్తి  తలసరి ఆదాయం రూ.2లక్షలు. జాతీయ ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం మెరుగ్గా ఉంది. తెస్తున్న అప్పుల వల్ల తెలంగాణలో అభివృద్ధి కనిపించడంలేదు. నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అప్పులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలంగాణ అప్పుల ఊబిలో మునిగిపోతోంది.. యువత మేల్కొనాలి’’ అని భట్టి విక్రమార్క అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని