లక్ష ఇళ్లని చెప్పి 3,428 చూపించారు: భట్టి

తాజా వార్తలు

Published : 20/09/2020 00:48 IST

లక్ష ఇళ్లని చెప్పి 3,428 చూపించారు: భట్టి

హైదరాబాద్‌: లక్ష రెండు పడక గదుల ఇళ్లు చూపించలేక రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమకు లక్ష రెండు పడకగదుల ఇళ్లు చూపిస్తామని చెప్పి రెండ్రోజులు చూపించి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. 

రెండ్రోజుల్లో  కేవలం 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. శాసనసభలో ఛాలెంజ్‌ చేసి మమ్మల్ని తీసుకెళ్లిన వాళ్లు చెప్పిన లెక్క 3,428 అని వివరించారు. లక్షల ఇళ్లు కట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ప్రతి సారి ఎన్నికల సమయంలో, శాసనసభలో తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తెరాస మోసం చేస్తోందన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి నాలుగువేల ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొన్ని చోట్ల పనులే ప్రారంభించలేదన్నారు. హైదరాబాద్‌ నగర ప్రజలను మోసం చేయడం దుర్మార్గమని భట్టి వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని