Nitish kumar: మాకు బిహారే ఓ కుటుంబం.. వాళ్లకు కుటుంబమే సర్వస్వం!

తాజా వార్తలు

Published : 26/10/2021 01:39 IST

Nitish kumar: మాకు బిహారే ఓ కుటుంబం.. వాళ్లకు కుటుంబమే సర్వస్వం!

పట్నా: ఈ నెలాఖరున బిహార్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న వేళ బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే గెలుస్తుందన్న విశ్వాసం ఉందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘నేను ప్రజలకు సేవ చేయడంలో బిజీగా ఉన్నా. ప్రజలే ప్రభువులు.. ఏం కావాలనుకుంటారో వాళ్లే నిర్ణయించుకోగలరు. దీనిపై నేను వ్యాఖ్యానించలేను. మా వరకైతే యావత్‌ బిహార్‌ ఒక కుటుంబం.. ఇతరులకైతే (ప్రతిపక్షాలు) వాళ్ల కుటుంబమే సర్వస్వం’’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఈ నెల 30న బిహార్‌లోని కుషేశ్వర్‌ అస్థాన్‌, తారాపూర్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జేడీయూకి చెందిన ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మరణంతో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో వాటిని నిలుపుకోవాలని నీతీశ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ప్రధానంగా ఆర్జేడీ, జేడీయూల మధ్యే హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్‌ కూడా అక్కడ తమ అభ్యర్థులను బరిలో దించడంతో ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమిలో కొత్త వార్‌ మొదలైంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దీనిపై నిన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఎందుకు సీటు ఇవ్వాలి.. ఓడిపోయేందుకా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని