జనాభా తగ్గాలంటే అదొక్కటే సరిపోదు: నీతీశ్‌ 

తాజా వార్తలు

Published : 12/07/2021 18:48 IST

జనాభా తగ్గాలంటే అదొక్కటే సరిపోదు: నీతీశ్‌ 

పట్నా: జనాభా నియంత్రణకు యూపీ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ముసాయిదాపై బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా మాత్రమే జనాభా నియంత్రణ లక్ష్యాన్ని సాధించలేమన్నారు. చట్టాలు చేసినంత మాత్రాన జనాభా నియంత్రణ సాధ్యం కాదనేది తన స్పష్టమైన అభిప్రాయమని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై ప్రతి రాష్ట్రానికీ స్వతంత్రత ఉంటుందన్నారు. అయితే, మహిళలు చదువుకున్నప్పుడే వారిలో తగిన చైతన్యం వస్తుందని, తద్వారా సంతానోత్పత్తి రేటు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు, కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు నీతీశ్‌ అన్నారు. కేంద్రం కూడా అలర్ట్‌ మోడ్‌లోనే ఉందని చెప్పారు. ఆక్సిజన్‌తో పాటు ప్రతిదీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆస్పత్రులు, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. కరోనా పరిస్థితిని నిరంతరం మానిటరింగ్‌ చేస్తునే ఉన్నామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని