రాష్ట్రం అవినీతిలో పరుగు పెడుతోంది:సోము వీర్రాజు 

తాజా వార్తలు

Updated : 13/12/2020 01:34 IST

రాష్ట్రం అవినీతిలో పరుగు పెడుతోంది:సోము వీర్రాజు 

అమరావతి: రాష్ట్రంలో కుటుంబపాలన వ్యవస్థను సమూలంగా వ్యతిరేకించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో నిర్వహించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి మాట దేవుడెరుగు.. అవినీతిలో మాత్రం పరుగులు పెడుతోందని విమర్శించారు. తితిదే, దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని భాజపా ఖండిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేలా కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు. వైకాపా పనితీరు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని