తెరాసలో చేరిన ‘సాగర్‌’ భాజపా నేత

తాజా వార్తలు

Updated : 31/03/2021 11:32 IST

తెరాసలో చేరిన ‘సాగర్‌’ భాజపా నేత

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక వేళ భాజపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కడారి అంజయ్య యాదవ్‌ తెరాసలో చేరారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో అంజయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
భాజపా నుంచి సాగర్‌ ఎమ్మెల్యే టికెట్‌ను అంజయ్య యాదవ్‌తో పాటు నివేదితారెడ్డి, పానుగోతు రవికుమార్‌ ఆశించారు. వీరిలో రవికుమార్‌ను ఆ పార్టీ తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో అసంతృప్తికి గురైన అంజయ్య యాదవ్‌.. భాజపాను వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని