సీఎంలూ..సరిహద్దులో ఆర్తనాదాలు వినండి
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎంలూ..సరిహద్దులో ఆర్తనాదాలు వినండి

ఏపీ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి

అమరావతి: ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు వినాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏపీ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. నిన్న రాత్రి నుంచి ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించని నేపథ్యంలో ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సరిహద్దుల్లో రోగులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. తెలంగాణ పోలీసులు సాధారణ ప్రయాణికులను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతించి అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారని.. ఇంతకంటే ఘోరం, సిగ్గుచేటు మరొకటి లేదని విమర్శించారు. ఆంధ్ర పోలీసులు రోగులకు ఇచ్చిన ఈ-పాస్‌ను సైతం తెలంగాణ పోలీసులు లెక్కచేయడం లేదని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని