కాంగ్రెస్‌లోకి ఎంపీ అర్వింద్‌ సోదరుడు

తాజా వార్తలు

Updated : 13/07/2021 13:45 IST

కాంగ్రెస్‌లోకి ఎంపీ అర్వింద్‌ సోదరుడు

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కూడా..

హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు భాజపా ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు నిజామాబాద్‌ మాజీ మేయర్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోదరుడు ధర్మపురి సంజయ్‌, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎర్ర శేఖర్‌, భూపాలపల్లి సీనియర్‌ నాయకుడు గండ్ర సత్యనారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లో నేతలు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించానని సంజయ్‌ చెప్పారు. ‘‘కాంగ్రెస్‌లో పుట్టి పెరిగాను.. మా నాన్న కోసమే తెరాసలో చేరా. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నా. త్వరలో దిల్లీ వెళ్లి పెద్దల సమక్షంలో పార్టీలో చేరతా’’ అని సంజయ్ అన్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని కలిసిన ఎర్ర శేఖర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా భాజపా అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరతానని వెల్లడించారు. రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ బలోపేతం అవుతుందని గండ్ర సత్యానారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వీరి ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని