‘కేరళలో భాజపాకే సంపూర్ణ మెజారిటీ’!
close

తాజా వార్తలు

Published : 25/03/2021 11:02 IST

‘కేరళలో భాజపాకే సంపూర్ణ మెజారిటీ’!

కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని ప్రముఖ భాజపా నేత, మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ ఎన్నికలతో రాష్ట్రంలో భాజపా దశ మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను పోటీ చేస్తున్న పాలక్కడ్‌ నియోజకవర్గంలోనూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీధరన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. 

‘కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధిస్తుందనుకుంటున్నా. సంపూర్ణ మెజారిటీ సాధిస్తుంది.. లేదా రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా ఎదగడానికి తగిన స్థానాలు కైవసం చేసుకుంటుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ప్రజలు భాజపాకే ఓటేస్తారని భావిస్తున్నాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీధరన్‌ తాను విజయం సాధిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ‘కేరళలో నేటికీ చాలా పరిశ్రమల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పరిశ్రమల ద్వారానే రాష్ట్రానికి సంపద పెరుగుతుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎన్డీయే అధికారంలోకి వస్తే పారదర్శకతతో కూడిన, అవినీతి రహిత పాలన అందిస్తాం’అని శ్రీధరన్‌ తెలిపారు. 

ఇటీవల శ్రీధరన్‌ ప్రచారానికి వెళ్లగా ఓటర్లలు ఆయన కాళ్లు కడగడంపై వామపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ.. ‘లెఫ్ట్‌ పార్టీలకు భారత సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియదు. పెద్దవారి కాళ్లు కడగడం అనేది ఒక సంప్రదాయం. ఇలాంటి వాటి గురించి వామపక్షాలకు తెలియదు. పెద్దవారి పట్ల ఉన్న గౌరవ భావాన్ని తెలిపే క్రమంలో అదో విధానం. నా పిల్లలు కూడా ఆ పద్దతులు పాటిస్తారు. ఒక్క కేరళలో కాదు, దేశమంతా ఇలాంటి పద్దతులు పాటిస్తారు’ అని శ్రీధరన్‌ స్పష్టం చేశారు. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని