Karnataka Politics: కొత్త సీఎం ఎవరనే ప్రశ్నకు అరుణ్‌సింగ్‌ కామెంట్‌..

తాజా వార్తలు

Published : 27/07/2021 01:43 IST

Karnataka Politics: కొత్త సీఎం ఎవరనే ప్రశ్నకు అరుణ్‌సింగ్‌ కామెంట్‌..

దిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామాతో కొత్త సీఎం ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొత్త ముఖ్యమంత్రిగా ఎవరనేదానిపై భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు, పార్టీ ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారన్నారు. దీనిపై ఇప్పుడే తానేమీ చెప్పలేనని, తదుపరి సీఎం ఎవరో భాజపా పార్లమెంటరీ బోర్డు శాసనసభాపక్ష సమావేంలో తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. అయితే, ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే అంశంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. యడ్డీ రాజీనామాకు కారణాలేంటని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ఆయన ఇప్పటికే చెప్పారు కదా అంటూ అరుణ్‌సింగ్‌ సమాధానం దాటవేశారు.  

మరోవైపు, కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, అరుణ్‌సింగ్‌ను భాజపా బెంగళూరుకు పంపుతున్నట్టు సమాచారం. త్వరలోనే వీరు బెంగళూరుకు వెళ్లనున్నారు. అలాగే, స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే కగేరి కూడా గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌తో సమావేశమయ్యారు. అయితే,  అసెంబ్లీలో గత రెండేళ్లలో నిర్వహించిన పలు కార్యక్రమాలగురించి గవర్నర్‌కు వివరించేందుకు ఆయనను కలిసినట్టు స్పీకర్‌ కార్యాలయం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని