ShivSena: భాజపా ఆత్మపరిశీలన చేసుకోవాలి

తాజా వార్తలు

Published : 31/05/2021 01:07 IST

ShivSena: భాజపా ఆత్మపరిశీలన చేసుకోవాలి

ముంబయి: ఏడు వసంతాలు పూర్తి చేస్తున్న భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సుకు పెద్దగా ఏమీ చేయలేకపోయిందని శివసేన విమర్శించింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని కూడా చెప్పలేమని వ్యాఖ్యానించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లు గడిచినప్పటికీ.. సమయమంతా మహమ్మారి నియంత్రణలోనే గడిచిపోయిందని తెలిపారు. దేశ సంక్షేమం కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందని తెలిపారు.

మహమ్మారి సంక్షోభం కారణంగా దేశంలో ధరలు మండిపోతున్నాయని సంజయ్‌ రౌత్‌ తెలిపారు. అలాగే అనేక మంది ఉపాధి కోల్పోయారన్నారు. ప్రజలు కనీసం వారి నిత్యావసరాలను తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలు పెద్దగా ఏమీ కోరుకోవడం లేదని.. నిత్యావసరాలు అందితే చాలన్న భావనలో ఉన్నారన్నారు. మరి గత కొన్నేళ్లల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేసిందో.. లేదో.. ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యల్ని భాజపా నేత రామ్‌కదమ్‌ ఖండించారు. తమకు శివసేన పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే ఆశయాలపై నిలబడకుండా.. నిత్యం రంగులు మార్చే పార్టీకి తమకు హితబోధ చేయాల్సిన అవసరం లేదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని