30లో 26 సీట్లు భాజపాకే: అమిత్ షా 

తాజా వార్తలు

Updated : 29/03/2021 04:20 IST

30లో 26 సీట్లు భాజపాకే: అమిత్ షా 

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ తొలి విడత ఎన్నికల్లో 30 స్థానాలకు గానూ 26 స్థానాలు భాజపాకే దక్కనున్నాయని కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్‌ నేత అమిత్‌ షా అన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఆ మేరకు సమాచారం వచ్చిందని చెప్పారు. అస్సాంలో సైతం 47 స్థానాలకు గానూ 37 చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించనున్నారని ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్‌, అస్సాంలో శాంతియుతంగా తొలి విడత ఎన్నికలు నిర్వహించడం పట్ల ఈసీకి అమిత్‌ షా కృతజ్ఞతలు తెలియజేశారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందిందని చెప్పారు. ఈ లెక్కన మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో 200కు పైగా స్థానాల్లో భాజపా గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్ర భవిష్యత్‌, మార్పు కోసం భాజపాకు ఓటేయాలని నందిగ్రామ్‌ (మమత పోటీ చేస్తున్న స్థానమిది) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోదీ బంగ్లా పర్యటనపై తృణమూల్‌ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను బలపేతం కోసమే తప్ప ఇందులో రాజకీయాలకు తావులేదని అమిత్‌ షా వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని