Bengal: ఇప్పుడు కార్యకర్తల వంతు!

తాజా వార్తలు

Published : 09/06/2021 01:41 IST

Bengal: ఇప్పుడు కార్యకర్తల వంతు!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల్లో కొందరు తిరిగి సొంత పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల పలువురు నేతలు తిరిగి టీఎంసీలో చేర్చుకోవాలంటూ ఆ పార్టీ అధినేత్రి, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి లేఖలు కూడా రాశారు. ఇప్పుడు నేతల బాటలోనే కార్యకర్తలూ నడుస్తున్నారు. భాజపాలో చేరి తప్పుచేశామంటూ బిర్‌భుమ్‌ జిల్లాలోని బిప్రతికురి గ్రామంలో అనేక మంది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక లోకల్‌ మార్కెట్‌లో తిరుగుతూ ‘‘భాజపాలో చేరి తప్పు చేశాం. స్థానిక పంచాయతీలను దుర్వినియోగపర్చాం. అందుకు మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు మేం మళ్లీ టీఎంసీలో చేరాలనుకుంటున్నాం’’అంటూ మైకుల్లో ప్రకటించారు. ఈ ఘటనపై భాజపా జిల్లాస్థాయి నేతలు స్పందించారు. తమ కార్యకర్తలు టీఎంసీకి భయపడుతున్నారని, అందుకే బహిరంగ క్షమాపణ చెప్పారని ఆరోపించారు. 

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అధికార టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల ముందు పలు అంచనాలతో కొందరు నేతలు టీఎంసీని వదిలి భాజపాలో చేరారు. ఫలితాలు వారు అనుకున్నట్లు కాకుండా భిన్నంగా వచ్చాయి. టీఎంసీ పార్టీనే తిరిగి అధికారం దక్కించుకుంది. దీంతో భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు దీపేందు విశ్వాస్‌, సోనాలి గుహ, నేతలు సరళ ముర్ము, అమోల్‌ ఆచార్య టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు పార్టీ మారిన కార్యకర్తలు కూడా తిరిగి టీఎంసీలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని