TS news: దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు: ఈటల

తాజా వార్తలు

Updated : 10/07/2021 16:10 IST

TS news: దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు: ఈటల

హుజూరాబాద్:  హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రజలను తెరాస ప్రలోభాలకు గురి చేస్తోందని, తెలంగాణ మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఇతర ప్రాంతాల వారిని హుజూరాబాద్‌లో ఓటర్లుగా చేరుస్తూ.. దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెరాసకు రావనుకున్న ఓట్లను తొలగిస్తున్నారని, ఒక్కో ఇంట్లో 30, 40 దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని విమర్శించారు. తెరాస అరాచకాలకు సహకరించే అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. హుజూరాబాద్‌, జమ్మికుంటలో దొంగఓట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ఓటును కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పారు. చట్టాన్ని మరిచి బానిసల్లా పని చేయొద్దని అధికారులకు హితవు పలికారు. దొంగ ఓట్లపై కార్యకర్తలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని