దీదీకి మరో షాక్‌! 5వేల మందితో భాజపాలోకి..

తాజా వార్తలు

Published : 01/01/2021 16:15 IST

దీదీకి మరో షాక్‌! 5వేల మందితో భాజపాలోకి..

సువేందు బాటలోనే సోదరుడు సౌమేందు

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీకి మరో షాక్‌ తగిలింది. ఇటీవల మాజీ మంత్రి సువేందు అధికారి సహా పలువురు తృణమూల్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సువేందు తమ్ముడు కూడా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు మరో 5000 మంది టీఎంసీ కార్యకర్తలు కూడా పార్టీ మారనున్నట్లు సువేందు తెలిపారు. 

‘నా తమ్ముడు సౌమేందు నేడు భాజపాలో చేరనున్నారు. ఆయనతో పాటు కొంతమంది టీఎంసీ కౌన్సిలర్లు, 5000 మంది కార్యకర్తలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. క్రమక్రమంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విచ్ఛిన్నం అవుతుంది’ అని సువేందు అధికారి వెల్లడించారు. కంటైయ్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఉన్న సౌమేందును ఇటీవల ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అన్న సువేందు బాట పడుతున్నారు. ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగిన అనంతరం సౌమేందు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ కమలం వికసిస్తుందంటూ భాజపాలో చేరే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

సువేందు కుటుంబానికి చెందిన మరో ఇద్దరు ఇంకా తృణమూల్‌ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. సువేందు తండ్రి శిశిర్‌ అధికారి, మరో సోదరుడు దివ్వేందు టీఎంసీ నుంచి లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. నందిగ్రామ్‌, జంగల్‌మహల్‌ ప్రాంతంలో దాదాపు 40కి పైగా అసెంబ్లీ స్థానాల్లో అధికారి కుటుంబానికి మంచిపట్టు ఉంది. 2007లో దీదీ గెలుపునకు కారణమైన నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది కూడా ఈ కుటుంబమే. అలాంటిది ఇప్పుడు సువేందు భాజపాలో చేరడంతో దీదీకి గట్టి షాకే తగిలింది. ఈ ప్రాంతంలో సువేందు స్థానాన్ని భర్తీ చేసే బలమైన నాయకుడు టీఎంసీలో లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలాంశంగా మారనుంది.

ఇవీ చదవండి..

ఆలయాలపై దాడులు దురదృష్టకరం: చంద్రబాబు

ఆ సొమ్మును 11కోట్ల మందికి ఇవ్వొచ్చు: రాహుల్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని