Bengal: ‘దీదీ.. మీరు లేకుండా బతకలేను’

తాజా వార్తలు

Published : 23/05/2021 01:38 IST

Bengal: ‘దీదీ.. మీరు లేకుండా బతకలేను’

క్షమించాలని మాజీ మహిళా నేత లేఖ

కలకత్తా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)ని వీడి భాజపాలో చేరిన మహిళా నేత  సోనాలి గుహా యూటర్న్‌ తీసుకున్నారు. పార్టీని వీడినందుకు తనను క్షమించాలని, తిరిగి టీఎంసీలోకి చేర్చుకోవాలని సీఎం మమతా బెనర్జీని వేడుకున్నారు. ట్విటర్‌ వేదికగా బహిరంగంగా మమతా బెనర్జీకి క్షమాపణ లేఖ రాశారు.

‘ముక్కలైన మనసుతో ఈ లేఖ రాస్తున్నా.. ఉద్వేగంలో అప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నా. కానీ, ఆ పార్టీలో ఇమడలేకపోతున్నా. నీళ్లు లేకపోతే చేప ఎలా గిలగిలా కొట్టకుంటుందో.. మీరు లేకపోతే నా పరిస్థితి అలాగే తయారవుతుంది దీదీ. నన్ను క్షమించాలని ప్రాధేయపడుతున్నా.. మీరు గనక క్షమించకపోతే నేనే బతకలేను. నేను తిరిగి పార్టీలోకి వచ్చేందుకు అంగీకరించండి. ఇక జీవితాంతం మీ చల్లని నీడలో బతికుంటా..’ అంటూ ఉద్వేగంగా లేఖ రాశారు. 

పశ్చిమ బెంగాల్‌లో ఈ మధ్యే ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అధికార టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల ముందు పలు అంచనాలతో కొందరు ప్రముఖ నేతలు టీఎంసీని వదిలి భాజపాలో చేరారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోనాలి గుహ సైతం టీఎంసీని వీడి భాజపాలో చేరారు. అయితే ఆమె ఈసారి పోటీ చేయలేదు కానీ.. భాజపాను బలపర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. అయితే ఈ మధ్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘భాజపాలో చేరి తప్పు చేశాను. ఆ నిర్ణయానికి చింతిస్తున్నా. భాజపాకి నా అవసరం లేదు. మమతా బెనర్జీని తిట్టాలని మాత్రం వాళ్లు నాకు చెప్పేవారు. కానీ నేను ఆ పని చేయలేకపోయా’ అని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని