AP News: ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు

తాజా వార్తలు

Published : 06/06/2021 16:49 IST

AP News: ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు

విజయవాడ: తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించి ఓ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. 188, 269, 270 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్లతో పాటు ఎపిడమిక్‌ చట్టం కింద నరేంద్రపై కేసులు నమోదుచేశారు. 

గత నెల 29న నోవాటెల్‌ హోటల్‌లో 20మందితో కలిసి ధూళిపాళ్ల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కరోనా సమయంలో నిబంధనలు పాటించలేదని.. సమావేశానికి హాజరైన అందరూ హోటల్ లాబీలో భోజనం అనంతరం సమావేశం నిర్వహించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని