కేంద్రం తెలంగాణపై వివక్ష చూపట్లేదు: కిషన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 13:47 IST

కేంద్రం తెలంగాణపై వివక్ష చూపట్లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: దేశంలో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలు.. మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి ప్రారంభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గాలి ద్వారా కూడా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని ఈ ఉదయం సందర్శించిన ఆయన కరోనా బాధితులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలను పరిశీలించారు. అనంతరం కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబం కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని తెలిపారు. 

రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపట్లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో నమోదవుతున్న కేసులు, మరణాలను బట్టి కేంద్రం.. టీకా, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోందని వివరించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరా అవుతుందని ఆయన అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వచ్చేవారంలో ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని