భైంసా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా:కిషన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 09/03/2021 15:04 IST

భైంసా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: భైంసాలో ఇటీవల జరిగిన ఘర్షణ పునరావృతం కాకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సంఘ విద్రోహ శక్తులు ఘర్షణలు సృష్టిస్తున్నాయని.. వాటి ఆటకట్టించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. 

‘‘మూడు రోజుల క్రితం భైంసాలో జరిగిన మతపరమైన ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్నేళ్లుగా భైంసాలో ఘర్షణలు జరగటం.. ఒక వర్గం వారిపైన మరో వర్గం దాడి చేయడం ఏ మాత్రం మంచిది కాదు. మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఇటీవల భైంసాలో దాడులు జరిగాయి. ఈ విషయంపై డీజీపీతో మాట్లాడాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయాలని డీజీపీని కోరాను. ఈ విషయాలను హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కూడా చెప్పాను’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని