అద్దంకి to మంగళగిరి.. 300 కార్లతో తెదేపా భారీ ర్యాలీ

తాజా వార్తలు

Updated : 22/10/2021 17:20 IST

అద్దంకి to మంగళగిరి.. 300 కార్లతో తెదేపా భారీ ర్యాలీ

మంగళగిరి: తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. తెదేపా కార్యాలయాలపై అల్లరి మూకల దాడికి నిరసనగా ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం’ పేరుతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు కొనసాగిస్తున్న దీక్ష వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో తెదేపా నేతలు చేరుకోవటంతో ఎన్టీఆర్‌ భవన్‌ కిక్కిరిసిపోయింది.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ ఆధ్వర్యంలో 300 కార్లతో కార్యకర్తలు చంద్రబాబు దీక్ష వద్దకు తరలివచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని తెదేపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా మంగళగిరి చేరుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని భారీ ర్యాలీగా దీక్షా స్థలికి చేరుకున్నారు. అలాగే, హిందూపురం, విజయవాడ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివస్తుండటంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. మరోవైపు, నేతలు తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. నిన్న ఉదయం 8గంటలకు ప్రారంభమైన  చంద్రబాబు దీక్ష ఈరోజు రాత్రి 8గంటల వరకు కొనసాగనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని