close

తాజా వార్తలు

Updated : 06/03/2021 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యాన్ని అడ్డుపెట్టి రూ.50వేల కోట్ల అప్పు

తెదేపా అధినేత చంద్రబాబు

విశాఖ: పగటి వేషగాళ్లు పాస్కోను కలిసి బుకాయిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏబీసీడీ పాలసీ తెచ్చిందని అన్నారు. ఏబీసీడీ అంటే ఎటాక్‌, బర్డెన్‌,కరప్షన్‌, డిస్ట్రక్షన్ అనీ,  ఇదే ప్రభుత్వ విధానమని ఆయన విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా గాజువాక కూడలిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యంపై రూ.5 వేల కోట్లు తీసుకుంటున్నారని అన్నారు. ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, మద్యాన్ని ఆడ్డుపెట్టుకొని రూ.50 వేలకోట్లు అప్పు చేస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇంటిపన్నులు పెంచబోతున్నారని చెప్పారు.

‘‘ 2029 కల్లా రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ చేయాలనుకున్నా. దీని కోసం అనేక కార్యక్రమాలు తలపెట్టా. నేను పదవులు కోరుకునే వ్యక్తిని కాదు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాను అది చాలు. వైకాపా అరాచకాలను బట్టబయలు చేయాలంటే ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించండి’’ అని చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కోరమండల్‌ గేట్‌ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. షిప్‌యార్డ్‌ సిక్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నానని అన్నారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలివ్వమంటారా? అని ప్రశ్నించారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని విమర్శించారు. వడ్డీలు కట్టలేని పరిస్థితి వస్తే ప్రజల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. ప్రజల కోసం ఆనంద ఆదివారాలు పెట్టానని గుర్తు చేశారు. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.  ‘‘తెదేపా హయాంలో ఎక్కడైనా వసూళ్లు జరిగాయా? విశాఖ ప్రజలంతా నా సొంత కుటుంబం. బెదిరించి విశాఖలోని భూములను లాక్కుంటున్నారు. వైకాపాను గెలిపిస్తే రేపు మీ ఇంటినీ లాక్కుంటారు. రౌడీలు, గూండాల నుంచి విశాఖను కాపాడాలి’’ అని చంద్రబాబు అన్నారు.

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని