ప్రభుత్వంలో చలనం లేదు: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 03/07/2021 01:06 IST

ప్రభుత్వంలో చలనం లేదు: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని డిమాండ్ చేసినా ప్రభుత్వంలో చలనం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఏపీలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు పలుగు, పార పట్టి కూలీ పనులకు వెళ్తుండటం దయనీయమన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి అని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు తెదేపా సాధన దీక్ష చేపట్టి ప్రైవేటు టీచర్లను కూడా ఆదుకోవాలని కోరామని పేర్కొన్నారు. ఇప్పటికైనా వీరితో పాటు ఉపాధి కోల్పోయిన అన్ని కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ. 10 వేలు, కరోనా తీవ్రత తగ్గేంతవరకు నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా నున్నలో ఉపాధి కూలీ పనులకు వెళ్తున్న ప్రైవేటు టీచర్ ప్రసాద్ దుస్థితిపై ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని తన ట్విట్టర్‌ ఖాతాకు జత చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని