కరోనా ముప్పు తెలిసే అలా చేశారు: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 19/08/2020 14:16 IST

కరోనా ముప్పు తెలిసే అలా చేశారు: చంద్రబాబు

అమరావతి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కరోనా బారినపడడటం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన 24గంటల్లోనే కరోనా నిబందనలంటూ మళ్లీ కేసు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. దోపిడీ దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా?అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌రెడ్డి కరోనా బారిన పడ్డారంటే కారణమెవరని నిలదీశారు. కరోనా ముప్పు తెలిసీ ప్రజా నాయకుల పట్ల దారుణంగా నడుచుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి: యనమల
శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాస్తే హోం మంత్రి డీజీపీ.. భుజాలు తడుముకోవడమేంటని ప్రశ్నించారు. ‘‘ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌లలో సుప్రీంకోర్టు పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా?. ఆర్టికల్‌ 19, 21 ప్రకారం ఇది రాజ్యాంగ, కేంద్ర చట్టాల ఉల్లంఘనే. ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాయడమే. ప్రధాని స్పందించే వరకు డీజీపీ, హోం మంత్రి ఎందుకు ఆగలేక పోయారు?. వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు. ఏకారణంతో అడ్వొకేట్లు, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారు. ట్యాపింగ్‌పై సర్వీస్‌ ప్రొవైడర్లకు ఏమైనా లిఖిత పూర్వక ఆదేశాలు అందజేశారా? ఫోన్‌ ట్యాపింగ్‌ లో  రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి. ముద్దాయే సాక్ష్యాలు ఇవ్వాలని అడగటం ఎక్కడైనా ఉందా?’’ అని యనమల ప్రశ్నించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని