కరోనా మృతుల కుటుంబాలకు ₹10లక్షలు ఇవ్వాలి
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 05:26 IST

కరోనా మృతుల కుటుంబాలకు ₹10లక్షలు ఇవ్వాలి

తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌

అమరావతి: రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.10వేలు సాయం చేయాలన్నారు. ఈ నెల 29న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. కరోనాతో కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారన్నారు. దక్షిణాదిలో ఏపీలోనే నిరుద్యోగం అధికంగా ఉందని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం 2.3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతుల బకాయిలు రూ.3600 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం, మామిడి సహా పంట ఉత్పత్తులన్నీ కొనాలని డిమాండ్‌ చేశారు. నగరపాలికలు, పురపాలికల్లో పన్నుల పెంపును రద్దు చేయాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని